వకార్‌ అలా మాట్లాడొద్దు..

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

వకార్‌ అలా మాట్లాడొద్దు..

దుబాయ్‌: భారత్‌పై ఓపెనర్‌ రిజ్వాన్‌ ప్రదర్శన గురించి స్పందిస్తూ పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ వకార్‌ యూనిస్‌ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే తప్పు పట్టాడు. క్షమాపణలు చెప్పాలని కోరాడు. పాక్‌  ఆ మ్యాచ్‌ డ్రింక్స్‌ విరామం సందర్భంగా నమాజ్‌ చేశాడు. ఆ వీడియో వైరల్‌ అయింది. వకార్‌ ఓ పాక్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ సందర్భంగా హిందువుల మధ్యలో రిజ్వాన్‌ నమాజ్‌ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది’’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపైనే భోగ్లే స్పందించాడు. ‘‘వకార్‌ లాంటి స్థాయి గల వ్యక్తి అలా మాట్లాడడం నిరాశ కలిగించింది. మనలో చాలా మందిమి అలాంటి విషయాలు ఆటలో రాకుండా ఉంచడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. ఆట గురించే మాట్లాడతాం. క్రికెట్‌ రాయబారులుగా క్రికెటర్లు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. వకార్‌ క్షమాపణలు చెబుతాడని అనుకుంటున్నా. మనం క్రికెట్‌ ప్రపంచాన్ని ఏకం చేయాలి. మత ప్రాతిపదికన విభజించకూడదు’’ అని అన్నాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన