ప్రేక్షకులు లేకుండా జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 05:28 IST

ప్రేక్షకులు లేకుండా జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌

భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కరోనా నిబంధనలు పాటించడం కష్టమవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కాబట్టి నవంబరు 24 నుంచి డిసెంబరు 5 వరకు కళింగ స్టేడియంలో జరిగే జూనియర్‌ ప్రపంచకప్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ టోర్నీలో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతుంది. అర్జెంటీనా, బెల్జియం, కెనడా, చిలీ, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కొరియా, మలేసియా, పాకిస్థాన్‌, పోలెండ్‌, దక్షిణాఫ్రికా, స్పెయిన్‌, నెదర్లాండ్స్‌, అమెరికా జట్లు పోటీలో ఉన్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన