హెచ్‌సీఏ కేసు విచారణ వాయిదా

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

హెచ్‌సీఏ కేసు విచారణ వాయిదా

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ కలిసి ఉమ్మడిగా చెక్కులపై సంతకాలు పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ ముగిసి తీర్పు వెలువడేంత వరకూ ఈ ఆదేశాన్ని పాటించాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం హెచ్‌సీఏ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణను దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌-కమ్‌-ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన