సింధు శుభారంభం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

సింధు శుభారంభం

పారిస్‌: పీవీ సింధు, లక్ష్య సేన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో రెండో రౌండ్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్లో సింధు 21-15, 21-18తో డెన్మార్క్‌కు చెందిన జూలీ దవాల్‌ జకోబ్సెన్‌పై విజయం సాధించింది. మూడో సీడ్‌ సింధు రెండో రౌండ్లో డేన్‌ లైన్‌ (డెన్మార్క్‌)తో తలపడుతుంది. తకహషి (జపాన్‌)తో పోరులో 11-21, 2-9తో వెనుకబడి ఉన్న దశలో సైనా నెహ్వాల్‌ గాయంతో రిటైరైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో లక్ష్య 21-10, 21-16తో నుయెన్‌ (ఐర్లాండ్‌)ను ఓడించాడు. తన తర్వాతి రౌండ్లో అతడు కీన్‌ యూ (సింగపూర్‌)ను ఢీకొంటాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సౌరభ్‌ వర్మ 22-20,    21-19తో ఇగోర్‌ కొయెలో (బ్రెజిల్‌)పై నెగ్గాడు. మరోవైపు కిదాంబి శ్రీకాంత్‌ కథ ముగిసింది. అతడు   18-21, 22-20, 19-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమొటా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పారుపల్లి కశ్యప్‌, ప్రణయ్‌ కూడా పరాజయంపాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌- అశ్విన్‌ జోడీ 21-19, 21-15తో మథియాస్‌- సుర్రో (డెన్మార్క్‌)పై నెగ్గింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన