నిఖత్‌.. పసిడి పంచ్‌

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

నిఖత్‌.. పసిడి పంచ్‌

జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌

హిసార్‌: జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి సత్తాచాటింది. తిరుగులేని పంచ్‌లతో అదరగొట్టి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. హరియాణాలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌ 50-52 కేజీల విభాగంలో ఆమె పసిడి సొంతం చేసుకుంది. బుధవారం ఫైనల్లో నిఖత్‌ 4-1 తేడాతో మీనాక్షి (హరియాణా)పై విజయం సాధించింది. టోర్నీ సాంతం నిలకడగా రాణించిన 25 ఏళ్ల నిఖత్‌.. ఫైనల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించి ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ టోర్నీలో స్వర్ణంతో పాటు ఉత్తమ బాక్సర్‌ అవార్డునూ ఆమె సొంతం చేసుకోవడం విశేషం. జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. నేరుగా డిసెంబర్‌ మొదటి వారంలో టర్కీలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీ పడేందుకు అర్హత సాధించింది. ఈ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన బాక్సర్లు.. ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో దేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తారని భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రకటించింది. ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి నిహారిక (60-63 కేజీలు) కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన