close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రెజిల్‌లో చావు కేకలు

తొలిసారిగా 4,000 దాటిన మరణాల సంఖ్య

సావోపాలో, మనీలా: బ్రెజిల్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా ఒక్క మంగళవారంనాడే ఆ దేశంలో 4,195 మంది కొవిడ్‌-19కు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3.40 లక్షల దిశగా పరుగులు పెడుతోంది. కరోనా మరణాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో ఉంది. ఆ దేశంలో 5.7 లక్షల మందికి కొవిడ్‌-19 కాటుకు బలయ్యారు. ఇక ఈ జాబితాలో రెండో స్థానం బ్రెజిల్‌దే. మరోవైపు, 24 గంటల వ్యవధిలో సంభవించిన మరణాల్లో నాలుగు వేల మార్క్‌ని దాటిన మూడో దేశంగానూ బ్రెజిల్‌ నిలిచింది. ఇంతకుముందు అమెరికా, పెరూ దేశాల్లో మాత్రమే ఒక్క రోజులో 4,000కుపైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలినా, రోగులతో నిండిన ఆసుపత్రుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. చాలా మంది గవర్నర్లు, మేయర్లు, జడ్జిలు ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నారు. 4.6 కోట్ల జనాభాతో బ్రెజిల్‌లోనే అత్యంత రద్దీ రాష్ట్రమైన సావోపాలోలో తాజాగా ఒక్క రోజు వ్యవధిలో 1,400 మరణాలు నమోదయ్యాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన