close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 08:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియాకు కొవిడ్‌

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు కరోనా సోకింది. కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు పాజిటివ్‌ వచ్చినట్లు ఆదివారం వైద్యాధికారులు తెలిపారు. గత వారం ఆమెను కలిసిన కొందరి బంధువుల్లో ఒకరికి పాజిటివ్‌ రావడంతో జియాకు కూడా పరీక్షలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఛైర్‌పర్సన్‌ అయిన 75 ఏళ్ల ఖలీదా జియాకు 2018లో రెండు అవినీతి కేసుల్లో 17 ఏళ్ల జైలుశిక్ష పడింది. కరోనా నేపథ్యంలో ఆమెను తాత్కాలికంగా జైలు నుంచి విడుదల చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన