close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ 50 జిల్లాల్లో వైరస్‌ను పట్టించుకోలేదు

ఆరోగ్య మంత్రిత్వశాఖకు కేంద్ర బృందాల నివేదిక

దిల్లీ: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న 50 జిల్లాల్లో ‘వైరస్‌’ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదని, మార్గదర్శకాలను పాటించలేదని కేంద్ర బృందాలు నివేదించాయి. దీంతో కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు మరింత కఠినంగా మార్గదర్శకాలు అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ మూడు రాష్ట్రాలనూ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర బృందాల నుంచి వచ్చిన సమాచారం (ఫీడ్‌బ్యాక్‌) ఆధారంగా ఈ మూడు రాష్ట్రాలకు లేఖలు రాసింది. అందులో పలు అంశాలను ప్రస్తావించింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మహారాష్ట్రలోని 30, ఛత్తీస్‌గఢ్‌లోని 11, పంజాబ్‌లోని 9 జిల్లాలకు కేంద్ర బృందాలు ఇటీవల తరలివెళ్లిన సంగతి తెలసిందే. అనంతరం ఆ బృందంలోని సభ్యులు స్థానిక సంస్థల అధికారులతో కలిసి కొవిడ్‌-19 నియంత్రణకు సంబంధించి పలు చర్యలు చేపట్టారు. తాము గమనించిన అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖకు తాజాగా నివేదిక సమర్పించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన