close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మొదలైన వలస కార్మికుల ప్రవాహం

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ భయాలే కారణం
మధ్యప్రదేశ్‌ మార్గంలో రద్దీ

ఇండోర్‌: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, గతేడాది తరహాలోనే సంపూర్ణ లాక్‌డౌన్‌ విషయమై నిరంతరం చర్చలు జరుగుతుండడంతో.. ముంబయి నుంచి మధ్యప్రదేశ్‌లోని వాణిజ్య నగరమైన ఇండోర్‌ మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. చాలా మంది వలస కార్మికులు ఈ మార్గంలోనే ప్రయాణించి సొంత రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లకు చేరుకుంటారు. ముంబయి-ఆగ్రా రోడ్డుగా పిలిచే ఈ మార్గంలో కొన్ని రోజులుగా మోటారు సైకిళ్ల సంఖ్య, నలుపు-ఎరుపు రంగులతో కూడిన చిన్నపాటి ట్రక్కులు, ఆటోరిక్షాల ప్రవాహం పెరిగిందని స్థానికుడు ఒకరు చెప్పారు. ‘‘ముంబయిలో మళ్లీ కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గతేడాది తరహాలోనే లాక్‌డౌన్‌ విధించే అవకాశముంది. దీంతో మాకు ఉపాధి దూరమవుతుంది. అందువల్ల మేం సొంతింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం’’అని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడు రామ్‌శరణ్‌ సింగ్‌ (40) చెప్పారు. ఆ మార్గంలో వెళ్లే ఎవరిని కదిపినా దాదాపు ఇవే తరహా కథలు వినిపిస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన