close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పరిస్థితి భయంకరంగా ఉంది

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా పరిస్థితి భయంకరంగా ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి శనివారం వరకు 24 గంటల వ్యవధిలో దిల్లీలో 10,732 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఏనాడూ ఈ స్థాయిలో కేసులు రాలేదు. ‘‘నాలుగో దశ గతంలో వచ్చిన దశ కంటే ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం పరిస్థితిని గమనిస్తోంది’’ అని కేజ్రీవాల్‌ చెప్పారు. ‘‘నేను లాక్‌డౌన్‌కు అనుకూలం కాదు. కొవిడ్‌ నియంత్రణకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని నమ్ముతున్నాను. ఒకవేళ ఆసుపత్రి వ్యవస్థ కుప్పకూలితేనే లాక్‌డౌన్‌ విధించాలి’’ అని ఆయన తెలిపారు. ‘‘మాకు మీ సహకారం అవసరం. మీరు సహకరిస్తే.. ఆసుపత్రుల్లో పరిస్థితి నియంత్రణలో ఉంటుంది. అప్పుడు లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం రాదు’’ అని వ్యాఖ్యానించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన