close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మా టీకాల సమర్థత తక్కువే

చైనా ఉన్నతాధికారి అంగీకారం

బీజింగ్‌: చైనా తయారు చేస్తున్న కరోనా టీకాలు అంత సమర్థమైనవి కావు. ఈ విషయాన్ని ఆ దేశ ఉన్నతాధికారే అంగీకరించడం గమనార్హం. టీకాలన్నింటినీ కలిపి కొత్తది తయారు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చెంగ్డు నగరంలో శనివారం   ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’ డైరెక్టర్‌ గావో ఫు విలేకరులతో మాట్లాడుతూ ‘‘చైనా తయారు చేసిన టీకాలు ఎక్కువ రక్షణ కలిగించేవి కావు. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా రూపొందించిన పలు రకాల టీకాలను కలిపి ఉపయోగించవచ్చా అన్నదానిపై పరిశీలన చేస్తున్నాం’’ అని తెలిపారు. చైనాకు చెందిన ప్రయివేటు కంపెనీ సినోవాక్‌ తయారు చేసిన టీకా సామర్థ్యం 50.4 శాతంగా తేలింది. దీన్ని కొనుగోలు చేసిన బ్రెజిల్‌లో అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడయింది. ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్‌ కూడా మరో టీకా తయారు చేసింది. ఇవన్నీ పలు దేశాలకు ఎగుమతయ్యాయి కూడా. ఇతర దేశాలన్నీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ విధానంలో టీకాలు తయారు చేయగా గతంలో దీనిపై గావో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తే మంచిదని ఆయన అంగీకరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన