close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవిభక్త కవలల జననం

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని కేంద్రపడ జిల్లా రాజ్‌నగర్‌ సమితి కనా గ్రామానికి చెందిన ఓ మహిళ అవిభక్త కవలలకు(ఆడశిశువులు) జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం పురిటి నొప్పులు మొదలవడంతో ఆమె భర్త రాజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లతో అవిభక్తంగా శిశువులు జన్మించడంతోపాటు పరిస్థితి విషమించడంతో కేంద్రపడ జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం వీరిని కటక్‌ శిశుభవన్‌లో ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలోని శిశు వైద్య నిపుణులు దేబాసిస్‌ సాహు మీడియాతో మాట్లాడుతూ.. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జన్మిస్తారని, కవలలిద్దరి ఛాతి, కడుపు అతుక్కొని ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదన్నారు. అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. కూలి పనులు చేసే తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన