close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వలస కార్మికుల బతుకు యాత్ర!

లాక్‌డౌన్‌ కష్టాలు భరించలేమంటూ సొంతూళ్లకు పయనం

దిల్లీ, ముంబయి: కరోనా కేసులు విజృంభిస్తుండటంతో వలస కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే- నాటి తిప్పలు పడలేమని... చేసేందుకు పనుల్లేక, చేతిలో చిల్లి గవ్వ లేక నరకయాతన అనుభవించాల్సి వస్తుందని సామాన్లు సర్దుకుని బస్టాండ్లకు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలోని తిలక్‌నగర్‌ టెర్మినస్‌, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌, ముంబయిలోని బస్టాండ్‌లు మంగళవారం వలస కార్మికులతో కిటకిటలాడాయి. పుణె నుంచి కూడా వేలాది మంది కార్మికులు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు.
* దిల్లీ నుంచి పెద్దసంఖ్యలో కార్మికులు సొంతూళ్లకు పయనమైన క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. కేంద్రం కనీస బాధ్యతగా వలస కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్‌ చేశారు.
బస్సు బోల్తా.. ముగ్గురి మృతి
గ్వాలియర్‌: మధ్యప్రదేశ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా పడి మంగళవారం ముగ్గురు వలస కూలీలు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. దిల్లీ నుంచి వస్తున్న ఈ బస్సును డ్రైవరు మలుపు తిప్పుతున్న సమయంలో టికామ్‌గఢ్‌ వద్ద ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకున్నట్లు చెప్పారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన