close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ మందులపై పన్ను వద్దు

కేంద్రానికి పలు రాష్ట్రాల విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఔషధంపై పన్ను మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు రాష్ట్రాలు విన్నవించాయి. వైద్యపరమైన ఆక్సిజన్‌ తదితర సాధనాలపైనా సుంకం విధించవద్దని కోరాయి. ప్రస్తుతం వాటిపై 12% పన్ను వసూలు చేస్తున్నారు. మరోవైపు- వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశాన్ని త్వరగా నిర్వహించాలని కేంద్రానికి రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి పలు అంశాలు మండలి ముందు పెండింగ్‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జీఎస్టీ మండలి భేటీ అవ్వాలి. అయితే- చివరగా గత ఏడాది అక్టోబరులో సమావేశం జరిగింది. దీంతో భేటీని త్వరగా నిర్వహించాలనే వినతులు అందుతున్నాయి. 2022 జులై తర్వాత కూడా తమకు జీఎస్టీ పరిహారాన్ని అందించాలన్న డిమాండ్‌ను తదుపరి సమావేశంలో రాష్ట్రాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన