close

ప్రధానాంశాలు

Published : 21/04/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముంబయిలో 2,200 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ స్వాధీనం

ముంబయి: కొవిడ్‌ మహమ్మారి పంజా విసురుతున్న వేళ.. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు పెద్దఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వీటిని ఎగుమతి చేయడం కోసం ముంబయిలో రెండుచోట్ల నిల్వ ఉంచిన దాదాపు 2,200 రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను పోలీసులు, ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ముంబయి సబర్బన్‌లోని అంధేరి, దక్షిణ ముంబయిలోని న్యూ మెరైన్‌ లైన్స్‌లో ఓ ఫార్మా కంపెనీ వీటిని నిల్వ ఉంచింది. రెమ్‌డెసివిర్‌ ఎగుమతులపై నిషేధం ఉన్నా.. వీటిని విదేశాలకు తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
*విదేశాలకు తరలించడం కోసం దాదాపు 60 వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను ముంబయిలో నిల్వచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రక్‌ ఫార్మా డైరెక్టర్‌ రాజేశ్‌ దొకానియాను పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. అయితే వీటిని ముంబయిలో నిల్వచేయలేదని, ఫార్మా కంపెనీకి దామన్‌లో ఉన్న గోదాముకు తరలించామని అతను చెప్పాడు.
* మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో వినియోగించడానికి వీలుగా 15వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు తదితర చోట్ల నుంచి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా తరలించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన