close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్యూబా తీవ్రవాద పోషక దేశమే

జాబితాలో మళ్లీ చేర్చిన అమెరికా

వాషింగ్టన్‌: క్యూబాను మళ్లీ తీవ్రవాద పోషక దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. అమెరికాలో నేరాలకు పాల్పడిన వారికి ఆశ్రయం కల్పించడం, వెనెజువెలా నేత నికోలస్‌ మదురోకు మద్దతివ్వడం, క్యూబన్లను అణచివేయడం.. ఇత్యాది చర్యలకు పాల్పడుతున్నందువల్ల దాన్ని తీవ్రవాద పోషక దేశాల జాబితాలో చేర్చినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మంగళవారం ప్రకటించారు. అంతర్జాతీయ తీవ్రవాదానికి క్యూబా పదేపదే మద్దతిస్తోందని ఆయన మండిపడ్డారు. పొరుగుదేశంతో సత్సంబంధాల కోసం 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా క్యూబాను తీవ్రవాద పోషక జాబితా నుంచి తొలగించారు. అయితే ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను గద్దెదిగడానికి వారం రోజుల ముందు క్యూబాను మళ్లీ తీవ్రవాద పోషక జాబితాలో చేర్చారు. అదే విధానాన్ని ప్రస్తుతం బైడెన్‌ ప్రభుత్వమూ కొనసాగించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన