close

ప్రధానాంశాలు

Updated : 21/04/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకోగలం

ముడి పదార్థాల సరఫరాపై బైడెన్‌ సర్కారు వ్యాఖ్య

వాషింగ్టన్‌: భారత ఔషధ పరిశ్రమల అవసరాన్ని తాము అర్థం చేసుకోగలమని అమెరికాలోని బైడెన్‌ సర్కారు తెలిపింది. వాటిని తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో అమల్లో ఉన్న ప్రత్యేక చట్టం వల్ల కొవిడ్‌-19 టీకాల తయారీకి అవసరమైన కీలక ముడిపదార్థాల ఎగుమతిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించింది. సదరు చట్టం ప్రకారం అమెరికా కంపెనీలు.. దేశీయ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలని సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అమెరికా ఈ మేరకు స్పందించింది. భారత్‌లో అమెరికా రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు కూడా ఈ అంశాన్ని ఇటీవల బైడెన్‌ సర్కారులోని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. దీనిపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపారు. సదరు ముడి సరకుల ఎగుమతిపై ఆంక్షలు లేవని, అయితే, దేశీయ టీకాల ఉత్పత్తి అవసరాలకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా అధికారులు స్పష్టంచేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన