తమిళనాడులో ఆక్సిజన్‌ అందక 13 మంది మృతి?
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళనాడులో ఆక్సిజన్‌ అందక 13 మంది మృతి?

ఈనాడు డిజిటల్‌, చెన్నై: తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం   నుంచి అర్ధరాత్రి వరకు 13 మంది రోగులు మృతి చెందారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం వల్లే ఈ మరణాలు సంభవించాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీన్ని జిల్లా కలెక్టర్‌ జాన్‌ లూయిస్‌ కొట్టిపారేశారు. ‘ఆక్సిజన్‌ ట్యాంకులో సాంకేతిక లోపం ఉంటే సరిచేశాం. ట్యాంకులో ఇప్పటికే ఆక్సిజన్‌ నిల్వ ఉండగా.. అదనంగా 40 సిలిండర్లు సిద్ధంగా ఉంచామని వివరించారు. మంగళవారం నాటికి ఆక్సిజన్‌ సాయంతో 309 మంది రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరణించిన వారిలో ఒకరు మాత్రమే కరోనాతో చికిత్స పొందుతున్నారని, మిగిలిన 12 మంది కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో చేరారని తెలిపారు. మరోవైపు ఆసుపత్రిలో ఆక్సిజన్‌, సిబ్బంది కొరత తీర్చాలంటూ కొందరు వైద్యులు, నర్సులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఆక్సిజన్‌ నింపడంలో ఆలస్యం వల్లే సమస్య తలెత్తింది. ఆక్సిజన్‌ పంపిణీదారులు ప్రైవేటు ఆసుపత్రులకు మొదటి ప్రాధాన్యమిస్తున్నారని సిబ్బంది వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన