తొమ్మిది యుద్ధనౌకల్లో భారత్‌కు ఆక్సిజన్‌ సిలిండర్లు
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిది యుద్ధనౌకల్లో భారత్‌కు ఆక్సిజన్‌ సిలిండర్లు

ఈనాడు, విశాఖపట్నం: భారత నౌకాదళం తొమ్మిది యుద్ధనౌకల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, భారీ ఆక్సిజన్‌ ట్యాంకర్లు, కొన్ని రకాల వైద్య పరికరాలను భారతదేశానికి తీసుకు వస్తోందని తూర్పు నౌకాదళ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రసేతు-2 పేరుతో కొవిడ్‌ సహాయ చర్యలను నౌకా దళం చేపట్టిందన్నారు. ఆక్సిజన్‌ కొరత తీర్చడానికి పర్షియన్‌ గల్ఫ్‌, ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని భారత స్నేహపూర్వక దేశాలు ముందుకు వస్తున్నాయని వివరించారు. బహ్రెయిన్‌ నుంచి  27 టన్నుల సామర్థ్యం గల (ఒక్కోటి) లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు రెండింటితో బుధవారం ఐ.ఎన్‌.ఎస్‌.తల్వార్‌ యుద్ధనౌక మంగళూరు నౌకాశ్రయానికి చేరుకుందన్నారు. ఐ.ఎన్‌.ఎస్‌.కోల్‌కతా అనే మరో యుద్ధనౌక కువైట్‌ నుంచి రెండు 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్‌ సిలిండర్లు, 47 కాన్సన్‌ట్రేటర్లతో బుధవారం బయలుదేరిందన్నారు. మరో నాలుగు యుద్ధనౌకలు కువైట్‌, ఖతార్‌ల నుంచి తొమ్మిది 27 టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 1,500 ఆక్సిజన్‌ సిలిండర్లను తీసుకురానున్నాయని తెలిపారు. ఐ.ఎన్‌.ఎస్‌.ఐరావత్‌ యుద్ధనౌక బుధవారం సింగపూర్‌ నుంచి ఎనిమిది 27టన్నుల ఆక్సిజన్‌ ట్యాంకులు, 3,600 ఆక్సిజన్‌ ట్యాంకులతో బుధవారం విశాఖకు బయలుదేరిందన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన