Vaccine: విస్తృత టీకాతో ఉద్ధృతులకు అడ్డుకట్ట
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 07:58 IST

Vaccine: విస్తృత టీకాతో ఉద్ధృతులకు అడ్డుకట్ట

వెల్లూరు సీఎంసీ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, దిల్లీ: విస్తృత టీకా కార్యక్రమంతో భవిష్యత్తులో కరోనా ఉద్ధృతులను అడ్డుకోవచ్చని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) వైద్య నిపుణులు పేర్కొన్నారు. టీకా ద్వారా ఇన్‌ఫెక్షన్‌తోపాటు తీవ్రమైన రోగం నుంచి రక్షణ పొందడమే కాకుండా, సంక్రమణ శృంఖలాన్ని (ట్రాన్స్‌మిషన్‌ చైన్‌) సైతం సమర్థంగా నిరోధించవచ్చన్నారు. తమ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ తీసుకున్న 8,991 మంది ఆరోగ్య స్థితిపై అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఆసుపత్రిలో 10,600 మంది ఉద్యోగులుండగా, 8,991 (84.8%) మందికి జనవరి 2 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందులో 93.4% మంది కొవిషీల్డ్‌, మిగిలిన వారు కొవాగ్జిన్‌ తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న 7,080 మందిలో 679 మంది (9.6%)కి రెండో డోసు తర్వాత సగటున 47 రోజుల్లో కరోనా సోకింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకోని సిబ్బందితో పోలిస్తే వీరిలో ప్రమాద ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఒకే డోసు తీసుకున్నా మంచి రక్షణే లభిస్తున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. 1,878 మంది ఒక్క డోసే తీసుకోగా వారిలో 200 (10.6%) మందే వైరస్‌ బారినపడ్డారు. అందులో 22(1.2%) మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. రెండు డోసులు తీసుకున్నాక ఇన్‌ఫెక్షన్‌కు గురైన 679 మందిలో 64 (0.9%) మందే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కేవలం నలుగురికి (0.58%) ఆక్సిజన్‌ అవసరం కాగా, ఇద్దరికి (0.29%) మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకోని 1,609 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో 438 (27.2%) మంది వైరస్‌ బారినపడ్డారు. అందులో 64 (14.61%) మందిని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 11 (2.51%)మందికి ఆక్సిజన్‌, 8 మందికి (1.82%) ఐసీయూ సేవల అవసరం వచ్చినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ ఫలితాలపై ప్రముఖ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ ట్విటర్‌ ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. ‘‘వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి. ఎక్కువ సంక్రమణ అవకాశాలున్న వైద్య సిబ్బందిలోనూ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా బాగా పని చేశాయి. రోగం తీవ్రరూపు సంతరించకుండా గొప్పగా అడ్డుకున్నాయి’’ అని ఆమె పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన