ప్రపంచ దేశాలకు టీకా భరోసా
close

ప్రధానాంశాలు

Updated : 12/06/2021 10:48 IST

ప్రపంచ దేశాలకు టీకా భరోసా

వంద కోట్ల డోసులు అందించనున్న జి-7 కూటమి!
అందులో సగం ఒక్క అమెరికా నుంచే..
హామీ ఇచ్చిన బైడెన్‌
తమ వంతుగా 10 కోట్ల డోసులు ఇస్తామన్న బ్రిటన్‌
ప్రారంభమైన జి-7 సదస్సు

లండన్‌, కార్బిస్‌ బే: కరోనా దెబ్బకు కకావికలమవుతున్న ప్రపంచ దేశాలకు ‘జి-7’ బాసటగా నిలవబోతోంది! కనీసం వంద కోట్ల టీకా డోసులను విరాళంగా అందించేందుకు కూటమి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా 50 కోట్ల డోసులను తాము అందించనున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ప్రకటించగా, తమ వాటాగా 10 కోట్ల డోసులు ఇవ్వనున్నట్లు బ్రిటన్‌ కూడా వెల్లడించింది. ‘జి-7’లోని ఇతర సభ్య దేశాలూ వ్యాక్సిన్ల అందజేతలో ఉదారంగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. మొత్తంగా కూటమి తరఫున కనీసం వందకోట్ల డోసులు పేద దేశాలకు అందుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘జి-7’లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, ఐరోపా సంఘం ఉన్నాయి.
నైరుతి ఇంగ్లాండ్‌లోని కార్బిస్‌ బే రిసార్టులో జి-7 సదస్సు శుక్రవారం కోలాహలంగా ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో నేతలు ఒకరికొకరు మోచేతులను తాకించుకుంటూ అభివాదాలు తెలుపుకొన్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. గత 18 నెలల్లో చేసిన పొరపాట్లను, 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలో చేసిన తప్పులను పునరావృతం చేయొద్దని హితవు పలికారు. భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా వర్చువల్‌ విధానంలో సదస్సులో పాల్గొననున్నాయి. శనివారంగానీ, ఆదివారంగానీ ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో ప్రసంగించనున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ కూటమి ద్వారా ఈ టీకాలను 92 అల్పాదాయ దేశాలు, ఆఫ్రికా కూటమికి చేరవేయనున్నారు. తమ వంతుగా మూడు కోట్ల డోసులను ఈ ఏడాది చివర్లోగా అందిస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ హామీ ఇచ్చారు.

భారత ప్రతిపాదనకు మెక్రాన్‌ మద్దతు
కొవిడ్‌ టీకాలపై పేటెంట్లను తాత్కాలికంగా రద్దు చేయాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద భారత్‌, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ మద్దతు పలికారు. ఈ విషయాన్ని జి-7 సదస్సులో లేవనెత్తుతానని విలేకర్ల సమావేశంలో చెప్పారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన