గెహ్లోత్‌పై పెరుగుతున్న ఒత్తిడి

ప్రధానాంశాలు

Updated : 15/06/2021 08:24 IST

గెహ్లోత్‌పై పెరుగుతున్న ఒత్తిడి

మంత్రి పదవుల కోసం  బీఎస్పీ ఎమ్మెల్యేల డిమాండ్‌

జయపుర: మంత్రివర్గాన్ని విస్తరించాలంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇంతవరకు కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ వర్గీయులు ఈ విషయమై డిమాండు చేయగా, వారికి ఇప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలు తోడయ్యారు. ప్రభుత్వంపై సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేసినప్పుడు ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు, పది మంది స్వతంత్రులే ఆదుకున్నారు. వారు తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడిన తమకు సముచిత స్థానం ఇవ్వాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు బీఎస్పీ తిరుగుబాటు ఎమ్మెల్యేలైన లఖన్‌ సింగ్‌, రాజేంద్ర గుఢా, సందీప్‌ యాదవ్‌లు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేస్తే ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన