నొవావాక్స్‌ టీకా 90 శాతం ప్రభావవంతం

ప్రధానాంశాలు

Updated : 15/06/2021 11:29 IST

నొవావాక్స్‌ టీకా 90 శాతం ప్రభావవంతం

వాషింగ్టన్‌: తమ టీకా 90.4 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని, సురక్షితమైనదని, కరోనా కొత్త వేరియంట్లనూ సమర్థంగా ఎదుర్కోగలదని నోవావాక్స్‌ కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలలోని 119 ప్రాంతాల్లో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో 29,960 మంది పాల్గొన్నారని వెల్లడించింది. వారిపై జరిపిన వివిధ అధ్యయనాల్లో ఈ ఫలితాలను నిర్ధరించుకున్నట్లు వెల్లడించింది. నిల్వ చేయడానికి, రవాణాకు ఎంతో అనుకూలమైనదనీ పేర్కొంది. అమెరికా, ఐరోపాలలో వినియోగ అనుమతులను కోరనున్నట్లు కంపెనీ సీఈవో స్టాన్లీ ఎర్క్‌ తెలిపారు. భారతదేశంలో నొవావాక్స్‌ టీకాను సీరమ్‌ సంస్థ తయారు చేయనుంది. ఆ మేరకు రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన