దేశ చట్టాలే ఉన్నతం
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:19 IST

దేశ చట్టాలే ఉన్నతం

మీ విధానాలు కాదు..
ట్విటర్‌కు స్థాయీసంఘం స్పష్టీకరణ

దిల్లీ: దేశ చట్టాలే అత్యున్నతమైనవి తప్ప, సంస్థ విధివిధానాలు కాదని సామాజిక మాధ్యమం ట్విటర్‌కు పార్లమెంటు సభ్యులు స్పష్టంచేశారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం పిలుపు మేరకు శుక్రవారం ట్విటర్‌ ప్రతినిధులు హాజరయి ఈ సామాజిక మాధ్యమం దుర్వినియోగం కాకుండా తీసుకుంటున్న చర్యలు, పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై వాంగ్మూలం ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ఆధ్వర్యంలోని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందుకు ట్విటర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ మేనేజర్‌ షగుఫ్తా కమ్రాన్‌, న్యాయవాది ఆయుషి కపూర్‌లు వచ్చారు. దాదాపు 90 నిమిషాల పాటు వివిధ అంశాలను వివరించారు. తాము తమ సంస్థ విధానాలకు కట్టుబడి ఉంటామని వారు చెప్పగా పార్లమెంటరీ స్థాయీ సంఘం అభ్యంతరం తెలిపింది. దేశ చట్టాలే సమున్నతమైనవని విస్పష్టంగా చెప్పింది. దేశ చట్టాలను ఉల్లంఘిస్తున్నందున ఎందుకు జరిమానా విధించకూడదని సభ్యులు ప్రశ్నించారు. ఎంపీలు కఠినమైన ప్రశ్నలు సంధించగా, ట్విటర్‌ అధికారులు అస్పష్టంగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. తమ విధానాలు కూడా దేశ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయంటూ వారు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఈ సమావేశంలో భాజపా సభ్యులు నిషికాంత్‌ దుబే, రాజ్యవర్ధన్‌ రాథోడ్‌, తేజస్వీ సూర్య, సంజయ్‌ సేథ్‌, జాఫర్‌ ఇస్లాం, సుభాష్‌ చంద్ర, విపక్షాలకు చెందిన మహువా మొయిత్రా (టీఎంసీ), జయదేవ్‌ గల్లా (తెలుగుదేశం) పాల్గొన్నారు. అధికార పక్షం సభ్యులు ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విటర్‌ అధికారులు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని సభ్యులంతా అంగీకరించారు. సమస్యల పరిష్కారానికి నిబంధనల ప్రకారం శాశ్వత స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, తాత్కాలిక అధికారిని నియమించడాన్ని తప్పుపట్టారు. ట్విటర్‌ అధికారులతో మరో దఫా సమావేశం కావాలని ప్రతిపక్ష సభ్యులు సూచించారు. అయితే వివిధ ప్రశ్నలకు లిఖిత పూర్వక సమాధానాలు ఇచ్చేలా ట్విటర్‌ను ఆదేశించాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ట్విటర్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్విటర్‌ అధికారులు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకొంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ అధికారులను కూడా ఈ స్థాయీ సంఘం పిలవనుంది. ట్విటర్‌ అధికారులతో భేటీ ముగిసిన తరువాత ఆ సంఘం సభ్యులు ఐటీ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ట్విటర్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘‘ఆన్‌లైన్‌లో పౌరుల హక్కుల పరిరక్షణకు మా సిద్ధాంతాలైన పారదర్శకత, భావస్వేచ్ఛ, గోప్యతలకు అనుగుణంగా పార్లమెంటరీ కమిటీతో కలిసి పనిచేస్తాం. ప్రజల సంభాషణకు వేదిక కల్పించడంతో పాటు, దానిని పరిరక్షించాలన్నది మాకు, భారత ప్రభుత్వానికి ఉన్న ఉమ్మడి లక్ష్యం. దాని కోసం కూడా కలిసి పనిచేస్తాం. దీనిద్వారా మా అభిప్రాయాలను చెప్పుకొనేందుకు అవకాశం కలిగింది’’ అని పేర్కొన్నారు.
ట్విటర్‌ ఎండీకి యూపీ పోలీసుల సమన్లు
ఓ వృద్ధునిపై దాడి జరిగిన సంఘటనలో చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ట్విటర్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ మహేశ్వరికి నోటీసులు పంపించారు. వారం రోజుల్లోగా లోనీ బోర్డర్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని సూచించారు. కొందరు యువకులు తనపై దాడి చేశారంటూ ఓ వృద్ధుడు చెప్పిన విషయం వీడియో రూపంలో ట్విటర్‌లో వచ్చింది. ఆ వృద్ధుడు చెప్పింది నిజం కాదని పోలీసులు తెలిపారు. ఈ తప్పుడు సమాచారాన్ని తొలగించనందుకు ట్విటర్‌పై కేసు నమోదయింది. దీన్ని షేర్‌ చేసిన పాత్రికేయులు, కాంగ్రెస్‌ నాయకులు సహా ఆరుగురిపైనా కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా మనీశ్‌కు సమన్లు పంపించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన