ఇద్దరు ముష్కరుల కాల్చివేత

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:22 IST

ఇద్దరు ముష్కరుల కాల్చివేత

మృతుల్లో లష్కరే తోయిబా కమాండర్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రత దళాలు మట్టుబెట్టాయి. సోపోర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు శుక్రవారం సైనికులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు దిగారని అధికారులు వెల్లడించారు. భద్రత దళాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని పేర్కొన్నారు. మృతుల్లో ఒకరిని లష్కరే తోయిబా కమాండర్‌ ఫయాజ్‌ అహ్మద్‌గా గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన