ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి తప్పనిసరి: సుప్రీం

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:35 IST

ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి తప్పనిసరి: సుప్రీం

దిల్లీ: విధి నిర్వహణలో నేరానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ నిర్వహించేందుకు.. తగిన అర్హతగల అధికారి నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఓ భూవ్యవహారంలో ప్రభుత్వ క్లర్కుకు విచారణ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అధికారిక విధులు నిర్వర్తించేటప్పుడు ఎదురయ్యే వేధింపులు, తప్పుడు ఆరోపణల నుంచి అధికారులు, ఉద్యోగులకు నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 197 రక్షణ కల్పిస్తుందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులకు ఈ సెక్షన్‌ రక్షణ ఛత్రంలా మారకుండా చూడాల్సిన ఆవశ్యకతను సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన