ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో నేడు అమిత్‌షా భేటీ

ప్రధానాంశాలు

Published : 24/07/2021 04:57 IST

ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో నేడు అమిత్‌షా భేటీ

 సరిహద్దు వివాదాలపై చర్చ

గువాహటి, ఈనాడు:ఈశాన్య రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శనివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మిజోరం, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలలో శాంతిభద్రతల స్థితిగతులు, కొవిడ్‌ పరిస్థితిపై చర్చ జరిగే అవకాశముంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగే ఈ సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు పాల్గొననున్నారు. అమిత్‌ షా వెంట కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్‌, కిషన్‌ రెడ్డిలు రానున్నారు. వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, మిజోరంతో అస్సాంకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. సమావేశం నేపథ్యంలో నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నైఫియు రియో శుక్రవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను కలిశారు. రెండు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో అమిత్‌ షా పాల్గొంటారని అధికారులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన