కేరళలో కోచింగ్‌ సెంటర్‌కు ‘పెగాసస్‌’ చిక్కులు

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 06:19 IST

కేరళలో కోచింగ్‌ సెంటర్‌కు ‘పెగాసస్‌’ చిక్కులు

భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని రాజకీయ నాయకులు, సామాచ్కీజిజిక కార్యకర్తలు, జర్నలిస్టులను ‘పెగాసస్‌’ వణికిస్తోంది. ఈ స్పైవేర్‌తో తమ ఫోన్లు ట్యాపింగ్‌ గురయ్యాయని చాలా మంది ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ‘పెగాసస్‌’ కేరళలోని కోజికోడ్‌ ప్రాంతంలో ఓ చిన్న కోచింగ్‌ కేంద్రాన్ని చిక్కుల్లో పడేసింది. కారణం.. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ కోసం ఆ కేంద్రం తీసుకొచ్చిన యాప్‌ పేరు కూడా ‘పెగాసస్‌’ కావడమే. దీంతో ట్యాపింగ్‌ చేయాలంటూ ఈ కోచింగ్‌ సెంటర్‌కు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ‘‘ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఈ యాప్‌ తయారు చేశాం. పెగాసస్‌ స్పైవేర్‌ అంశం వెలుగులోకి రావడంతో మా యాప్‌ డౌన్‌లోడ్‌లు రెట్టింపయ్యాయి. అదే సమయంలో ట్యాపింగ్‌ చేయమంటూ వందలాదిగా ఫోన్లు వస్తున్నాయి. మాది కోచింగ్‌ సెంటర్‌ అని చెప్పినా నమ్మడం లేదు. ఎక్కువగా ఉత్తర భారతం నుంచి ఈ ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి’’ అని నిర్వాహకుడు పీసీ సనూప్‌ వాపోయారు.


టెడ్‌టాక్‌లో ఏడేళ్ల చిన్నారి

మైకులు దొరికితే రెచ్చిపోయే వారే మాట్లాడ్డానికే జంకే వేదిక టెడ్‌ టాక్‌! అలాంటి వేదికపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఏడేళ్ల చిన్నారి మోలీ రైట్‌ అదురు, బెదురు లేకుండా అనర్ఘళంగా ప్రసంగించింది. టెడ్‌టాక్‌లో మాట్లాడిన అతిచిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే.. పిల్లల పెంపకంపై మోలీ పెద్దలకు సూచనలు చేయడం. ప్రతి బిడ్డకు ఐదేళ్ల వయసు ఎంతో కీలకం అని చెప్పిన మోలీ.. ఈ వయసులో పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమేం చేయాలో చక్కగా వివరించింది. దాగుడు మూతల ఆట పిల్లల పెంపకంలో కీలకమని పేర్కొంది. చిన్నారులతో గడపడం, వారితో మాట్లాడటం, ఆడుకోవటం, వారిని ఆరోగ్యంగా ఉంచేలా చూడడం, చుట్టూ ఉన్నవారితో వారిని కలవనివ్వడం వంటి ఐదు విషయాలను తల్లిదండ్రులు తప్పక పాటించాలని తెలిపింది. మోలీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన