వర్చువల్‌ సంభాషణలతో... పండుటాకుల్లో పెరిగిన ఒంటరితనం!

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 06:13 IST

వర్చువల్‌ సంభాషణలతో... పండుటాకుల్లో పెరిగిన ఒంటరితనం!

బ్రిటన్‌, అమెరికా నిపుణుల అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమై, కేవలం దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారానే ఇతరులతో సంభాషిస్తున్న వృద్ధులు... మరింత ఒంటరితనానికి లోనవుతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది! బ్రిటన్‌, అమెరికా, కెనడాలకు చెందిన సామాజిక నిపుణులు దీన్ని చేపట్టారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా 60 ఏళ్లు దాటిన చాలామంది వృద్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఫోన్‌, వీడియో కాల్స్‌ ద్వారా ఇతరులతో మాట్లాడేవారు. కానీ, వ్యక్తులను నేరుగా కలవడం ద్వారా వచ్చే భావోద్వేగ సంతృప్తి, స్థైర్యం వారికి ఫోన్‌ సంభాషణ వల్ల కలగలేదని నిపుణులు గుర్తించారు. పైగా, వారి మానసిక ఆరోగ్యం మరింత క్షణించి, ఒంటరితనానికి గురైనట్టు తెలిపారు. ‘‘బ్రిటన్‌, అమెరికాల్లో మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న వేళ చాలామంది వృద్ధులు వర్చువల్‌ విధానాల్లో బంధుమిత్రులతో సంభాషించారు. కొందరు మాత్రం కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎప్పట్లాగే ఇతరులతో నేరుగా భేటీ అయ్యారు. వ్యక్తులతో, సమాజంతో నేరుగా అనుసంధానం కావడాన్ని వర్చ్యువల్‌ విధానాలు భర్తీ చేయలేవని మా అధ్యయనంలో తేలింది. వీడియో కాల్స్‌, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల వల్ల వృద్ధుల్లో ఒంటరితనం మరింత పెరిగినట్టు గుర్తించాం’’ అని లాన్‌క్యాస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డా.యాంగ్‌ హూ చెప్పారు. అధ్యయనంలో భాగంగా బ్రిటన్‌కు చెందిన 5,148 మంది, అమెరికాకు చెందిన మరో 1,391 మంది వృద్ధుల నుంచి వారు వివరాలు సేకరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన