పోలీసుల నిర్బంధంలో ప్రశాంత్‌ కిశోర్‌ బృంద సభ్యులు

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 15:17 IST

పోలీసుల నిర్బంధంలో ప్రశాంత్‌ కిశోర్‌ బృంద సభ్యులు

అగర్తల: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ‘భారత రాజకీయ కార్యాచరణ కమిటీ’ (ఐ-ప్యాక్‌) సభ్యుల్ని త్రిపుర రాజధాని అగర్తలలో పోలీసులు నిర్బంధించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని, తృణమూల్‌ కాంగ్రెస్‌కి ఉన్న రాజకీయ అవకాశాలను మదించడానికి వారం రోజుల నుంచి ఈ బృందం ఓ హోటల్లో బస చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 22 మంది సభ్యుల బృందం అన్నిచోట్లా పర్యటిస్తోందని, వారి రాకకు కారణాలు తెలుసుకునేందుకు అందరినీ హోటల్‌కే పరిమితం కావాల్సిందిగా ఆదేశించామని పశ్చిమ త్రిపుర ఎస్పీ మాణిక్‌దాస్‌ తెలిపారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. వీరిని ఇలా నిర్బంధించడం.. ప్రజాస్వామ్యంపై దాడి అని తృణమూల్‌ విమర్శించింది. భాజపా నేతృత్వంలోని త్రిపుర సర్కారుపై విసిగిపోయిన ప్రజలు తృణమూల్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో కమలనాథులు బెదిరిపోయి, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్‌లాల్‌ సింఘా ఆరోపించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన