వచ్చే ఏడాదే మానవ రహిత గగన్‌యాన్‌ ప్రయోగం: ఇస్రో

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:05 IST

వచ్చే ఏడాదే మానవ రహిత గగన్‌యాన్‌ ప్రయోగం: ఇస్రో

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: ఇస్రో ఆధ్వర్యంలో డిసెంబరులో చేపట్టాల్సిన మానవ రహిత ‘గగన్‌యాన్‌’ యాత్ర సాధ్యపడకపోవచ్చని ఆ సంస్థ సోమవారం ప్రకటించింది. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా ప్రాజెక్టుకు సంబంధించిన హార్డ్‌వేర్‌ ఉపకరణాలను సమకూర్చలేకపోయినట్లు ఇస్రో అధ్యక్షుడు డాక్టర్‌ కె.శివన్‌ వివరించారు. దేశీయ సంస్థల హార్డ్‌వేర్‌ ఉత్పత్తులతోనే గగన్‌యాన్‌ డిజైన్‌, అనాలసిస్‌, డాక్యుమెంటేషన్‌ వ్యవస్థలు రూపొందించాలనేది సంకల్పం. మానవ సహిత గగన్‌యాన్‌ ప్రయోగానికి ముందుగా చేపట్టే రెండు మానవ రహిత ప్రాజెక్టుల్లో ఒకటి రానున్న డిసెంబరులో, మరొకటి 2022-23లో ప్రయోగించాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ప్రాజెక్టు తేదీలన్నీ సవరించే అవకాశం ఉందని శివన్‌ పేర్కొన్నారు. జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 వాహకనౌక ద్వారా ప్రయోగించే గగన్‌యాన్‌లో ప్రయాణించే నలుగురు వ్యోమగాములు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. మానసిక, భౌతిక, సాంకేతిక అంశాల్లో మరింత శిక్షణ కోసం విద్యా, నౌక, వైమానిక విభాగాలను ఈ వ్యోమగాములు సందర్శించనున్నారు. భారతీయ వైమానిక దళం నేతృత్వంలో శిక్షణ పొందుతున్నారు. వీరికి అవసరమైన వ్యవస్థలను రూపొందించేందుకు డీఆర్‌డీఓతో, సూక్ష్మ గురుత్వాకర్షణ ఇంధన వ్యవస్థల కోసం ఫ్రెంచ్‌, రష్యా, అమెరికా అంతరిక్ష సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గగన్‌యాన్‌ పూర్తిస్థాయి ప్రయోగం 2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా.. ఆ కల సాకారం కాకపోవచ్చని ఇస్రో ప్రకటించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన