భారతీయ సంస్కృతికి యువతే వారసులు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:05 IST

భారతీయ సంస్కృతికి యువతే వారసులు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈనాడు, దిల్లీ: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఏపీ మాజీ శాసనసభ్యులు ఎన్‌.పి.వెంకటేశ్వర చౌదరి రచించిన కాంబోడియా-హిందూ దేవాలయాల పుణ్యభూమి, నేటి వియత్నాం-నాటి హైందవ సంస్కృతి అన్న తెలుగు పుస్తకాలను సోమవారం దిల్లీలోని తన నివాసం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి విడుదల చేసి మాట్లాడారు. ‘‘సనాతన కాలం నుంచి భారతదేశం.. వసుధైక కుటుంబ భావనతో ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వస్తోంది. వేదవ్యాసుడు మొదలుకుని శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, గురునానక్‌, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నారాయణ గురు వంటి ఎందరో మహనీయులు సమాజాన్ని జాగృతం చేశారు. వారి బాటలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. కంచి కామకోటి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. వివక్షలకు అతీతంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక మార్గానికి అసలైన అర్థం చెప్పాయన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రజల మానసిక ఆరోగ్యంపైనా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చిందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన