కార్గిల్‌ అమరులకు ఘనంగా నివాళులు

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:10 IST

కార్గిల్‌ అమరులకు ఘనంగా నివాళులు

శ్రీనగర్‌, దిల్లీ: విజయ్‌ దివస్‌ సందర్భంగా సోమవారం కార్గిల్‌ యుద్ధ వీరులకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉన్న డాగర్‌ వార్‌ మెమోరియల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరులకు జాతి సలాం చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. లద్దాఖ్‌లోని ద్రాస్‌లో ఉన్న స్మారక స్థలం వద్దకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, వాతావరణం అనుకూలించక విరమించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సైనికుల ధైర్యసాహసాలను గుర్తు చేసుకున్నారు. వారికి, వారి కుటుంబాలకు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తూ సైనికుల త్యాగం ప్రతి రోజూ స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీలు సైనికుల త్యాగాలను ప్రస్తుతించారు. బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్‌, తాప్సీ, ఫర్హాన్‌ అఖ్తర్‌, అభిషేక్‌ బచ్చన్‌, అర్జున్‌ కపూర్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, కరణ్‌ జోహార్‌ తదితరులు అమరులకు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు. బంగ్లాదేశ్‌ యుద్ధంలో సాధించిన విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘స్వర్ణ విజయ వత్సర విజేత జ్యోతి’ని ద్రాస్‌లో ఉన్న కార్గిల్‌ స్మారక స్థూపం వద్దకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తదితరులు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన