2.38 లక్షల డొల్ల కంపెనీల రద్దు

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 05:50 IST

2.38 లక్షల డొల్ల కంపెనీల రద్దు

దేశంలో 2018-21 మధ్యకాలంలో 2,38,223 డొల్ల కంపెనీలను రద్దుచేసినట్లు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సహాయమంత్రి రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీల పరిధిలో 20,488, విజయవాడ పరిధిలో 4,918 కంపెనీలను రద్దుచేసినట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ముంబయి పరిధిలో 52,869, దిల్లీ పరిధిలో 45,595 కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దుచేసినట్లు వెల్లడించారు. మంత్రి సమాధానం ప్రకారం ఈ రెండు ఆర్‌ఓసీల తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక డొల్ల కంపెనీలు రద్దయ్యాయి. పనామా పేపర్ల లీక్స్‌తో ముడిపడిన సంస్థల్లో రూ.20,078 కోట్ల మేర బయటకు వెల్లడించని క్రెడిట్స్‌ని (నల్లధనం) గుర్తించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన