పిల్లలపై కొవావాక్స్‌ రెండోదశ ట్రయల్స్‌కు అనుమతి

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 12:45 IST

పిల్లలపై కొవావాక్స్‌ రెండోదశ ట్రయల్స్‌కు అనుమతి

దిల్లీ: దేశంలో 2-17 ఏళ్లలోపు పిల్లలపై కొవావాక్స్‌ కొవిడ్‌ టీకా రెండో దశ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సెంట్రల్‌ డ్రగ్‌ అథారిటీ నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. పుణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. 2/3 ట్రయల్స్‌ మొత్తం పది ప్రాంతాల్లోని 920 మంది పిల్లలపై చేస్తారు. ఇందులో 12-17 ఏళ్లలోపు 460 మంది, 2-11 ఏళ్లలోపు మరో 460 మంది ఉంటారు. అమెరికా కంపెనీ నోవావాక్స్‌ తయారుచేసిన కొవిడ్‌ టీకాను.. సీరం ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి కొవావాక్స్‌ పేరిట భారత్‌లో వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో నొవావాక్స్‌ పలు దేశాల్లో ఇప్పటికే పిల్లలపై నిర్వహించిన టీకా ట్రయల్స్‌ వివరాలను కూడా సమర్పించింది.

30 వేలకు దిగువన కొవిడ్‌ కేసులు

దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య కాస్త ఊరటనిచ్చే రీతిలో.. మంగళవారం 30 వేలకు దిగువకు తగ్గింది. గత 24 గంటల్లో 29,689 కేసులు నమోదు కాగా.. 415 మంది కొవిడ్‌తో మృతిచెందారు. 132 రోజుల తర్వాత ఇంత తక్కువ రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన