నా తండ్రిని పర్యవేక్షకుడిగా తొలగించండి

ప్రధానాంశాలు

Published : 28/07/2021 05:24 IST

నా తండ్రిని పర్యవేక్షకుడిగా తొలగించండి

మరోసారి కోర్టును ఆశ్రయించిన బ్రిట్నీ స్పియర్స్‌

లాస్‌ ఏంజెలెస్‌: 13 ఏళ్లుగా తన జీవితానికి, ఆస్తులకు చట్టబద్ధమైన పర్యవేక్షకుడిగా ఉన్న తన తండ్రి జేమ్స్‌ స్పియర్స్‌ను ఆ హోదా నుంచి తొలగించాలని ప్రముఖ పాప్‌ గాయని బ్రిట్నీ స్పియర్స్‌ కోర్టును ఆశ్రయించారు. ఆయన స్థానంలో అకౌంటెంట్‌ను నియమించాలని కోరారు. ఈమేరకు ఆమె కొత్త న్యాయవాది మాథ్యూ రోజెస్‌గర్ట్‌ సోమవారం లాస్‌ ఏంజెలెస్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. జేమ్స్‌ పర్యవేక్షణ నియంతృత్వంగా మారిందని, ఇక దాన్ని ఎంతమాత్రం సహించలేమని అందులో పేర్కొన్నారు. జేమ్స్‌ స్థానంలో సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌ అయిన జేసన్‌ రూబిన్‌ను నియమించాలని అభ్యర్థించారు. బ్రిట్నీకి చెందిన సుమారు 2.7 మిలియన్ల డాలర్ల నగదు, 57 మిలియన్ల డాలర్ల ఆస్తులకు జేమ్స్‌ పర్యవేక్షకుడిగా ఉన్నారు. అయితే ఆ హోదాను తన తండ్రి దుర్వినియోగం చేస్తూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని, తన జీవితాన్ని నరకప్రాయంగా చేశాడని బ్రిట్నీ ఇటీవల కోర్టుకెక్కడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రిట్నీ తాజా పిటిషన్‌ వేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన