వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని సాధిస్తాం

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 12:03 IST

వ్యాక్సిన్‌ లక్ష్యాన్ని సాధిస్తాం

నెలాఖరుకల్లా 51.73 కోట్ల డోసుల పంపిణీ : కేంద్రం

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి జులై ఆఖరు లోగా 50 కోట్ల డోసులు వేసేందుకు నిర్దేశించికున్న లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోలేకపోవచ్చంటూ ఇటీవల వచ్చిన వార్తలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఇవి అవాస్తవాలతో, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఖండించింది. ఈమేరకు జనవరి నుంచి జులై 31 నాటికి మొత్తం 51.73 కోట్ల డోసులు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. 51.60 కోట్ల డోసులను జులై నెలాఖరుకల్లా అందజేయనున్నట్లు మే నెలలో ప్రకటించిన విషయాన్ని ఓ ప్రకటనలో గుర్తుచేసింది. రాష్ట్రాలకు ముందుగా నిర్దేశించిన కేటాయింపుల ప్రణాళికకు అనుగుణంగానే టీకాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ నెలాఖరుకు 51.60 కోట్ల డోసులను అందుబాటులో ఉంచుతామని అంటే.. దానర్థం పంపిణీ చేసిన ప్రతి డోసూ వినియోగించినట్లు కాదని వివరణ ఇచ్చింది. కొద్ది రోజుల్లో మరిన్ని సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఇంతవరకు మొత్తం 45.7 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి మరో 6.03 కోట్ల మేర అందజేయనున్నట్లు వెల్లడించింది. ‘‘440 మిలియన్‌ (44.19 కోట్ల) టీకా డోసులకు పైగా వేసిన మైలురాయిని భారత్‌ చేరుకుంది. సంఖ్యాపరంగా ప్రపంచంలోనే ఇది అత్యధికం. వేగంగా కూడా ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇందులో 9.6 కోట్ల మంది రెండు డోసులూ తీసుకున్నారు’’ అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. జూన్‌లో 11.97 కోట్ల డోసులు వేయగా.. జులైలో 26వ తేదీ నాటికి 10.62 కోట్ల మేర వేసినట్లు వెల్లడించింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన