అసెంబ్లీ నుంచి మంత్రి వాకౌట్‌

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:02 IST

అసెంబ్లీ నుంచి మంత్రి వాకౌట్‌

ఛత్తీస్‌గఢ్‌లో అసాధారణ సంఘటన

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలో అసాధారణ సంఘటన జరిగింది. అసెంబ్లీ నుంచి మంగళవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ వాకౌట్‌ చేశారు. సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలకు నిరసనగానే మంత్రి శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇటీవల తనను అంతమొందించేందుకు టీఎస్‌ సింగ్‌ దేవ్‌ యత్నించారని ఎమ్మెల్యే బృహస్పతి సింగ్‌ ఆరోపించారు. దేవ్‌ అనుచరుల కారు జులై 24న తనను అనుసరిస్తున్న కారును కావాలనే ఢీ కొట్టిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం శాసనసభలో ఈ మేరకు మంత్రిపై ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీన్ని తప్పుపట్టిన మంత్రి సభ నుంచి వాకౌట్‌ చేశారు. తనపై ఎమ్మెల్యే బృహస్పతి సింగ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశిస్తేనే శాసనసభకు హాజరవుతానని చెప్పారు. ఈ అంశాన్ని పరిమిత అంశంగా ప్రభుత్వం పేర్కొనడంతో మంత్రి కలత చెందారు. అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానంపై సాక్ష్యాత్తు ఒక మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘ఎమ్మెల్యే ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలి. దీనిపై ప్రకటన విడుదల చేసే వరకు అసెంబ్లీలో ఉండే అర్హత నాకు లేదని భావిస్తున్నాను’’ అని మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ పేర్కొన్నారు. వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కావడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరోపణలను ఖండిస్తూ భాజపా సభ్యులు సభలో ఆందోళన చేశారు. చివరకు మరో ఇద్దరు మంత్రుల సూచన మేరకు సింగ్‌ దేవ్‌ తిరిగి అసెంబ్లీ చేరుకున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన