నిత్యావసర సరకుల సవరణ చట్టం రద్దుకు కిసాన్‌ సంసద్‌ డిమాండ్‌

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:02 IST

నిత్యావసర సరకుల సవరణ చట్టం రద్దుకు కిసాన్‌ సంసద్‌ డిమాండ్‌

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు...నిత్యావసర సరకుల చట్టానికి తీసుకొచ్చిన సవరణలనూ తిరస్కరిస్తున్నారు. దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో నిర్వహిస్తున్న కిసాన్‌ సంసద్‌లో మంగళవారం ఇదే అంశంపై చర్చను కొనసాగించారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు ప్రతిరోజు 200 మంది చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. మంగళవారం కిసాన్‌ సంసద్‌లో పంజాబ్‌, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, తమిళనాడు, బిహార్‌ల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళవారం దిల్లీలో భారీ వర్షం కారణంగా కిసాన్‌ సంసద్‌ కాస్త ఆలస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యింది. నిత్యావసర సరకుల సవరణ చట్టం 2020ని తక్షణమే రద్దు చేయాలని రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్తకిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. కిసాన్‌ సంసద్‌ ఈ మేరకు తీర్మానం చేయనుందని.. పార్లమెంటు కూడా ఈ చట్టాన్ని ఉపసంహరిస్తూ తీర్మానం చేయాలని బీకేయూ ప్రధాన కార్యదర్శి యుధ్‌వీర్‌ సింగ్‌ కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన