భారత్‌ నుంచి వచ్చిన గేదె మాంసంలో కరోనా మూలాలు

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:19 IST

భారత్‌ నుంచి వచ్చిన గేదె మాంసంలో కరోనా మూలాలు

మూడు కంటైనర్లను నిలిపేసిన కంబోడియా

నాంఫెన్‌: భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన మాంసం కంటైనర్లలో మూడింటిని నిలిపేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఒక ప్రైవేట్‌ సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులోని మాంస పదార్థాలను వారం తరువాత నాశనం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపేసింది.

ఇటీవల కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం భారత్‌ నుంచి వచ్చిన గేదె మాంసం కంటైనర్లలో కరోనా వైరస్‌ మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన