టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్నవారికి కొవిన్‌ ధ్రువపత్రాలు

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:02 IST

టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్నవారికి కొవిన్‌ ధ్రువపత్రాలు

దిల్లీ: కొవిడ్‌ టీకా ప్రయోగ పరీక్షల్లో పాల్గొని, వ్యాక్సిన్‌ పొందినవారికి ‘కొవిన్‌’ ధ్రువపత్రాలు (సర్టిఫికెట్లు) అందజేయనున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఈమేరకు ప్రయోగపరీక్షల్లో పాల్గొని టీకా పొందినవారి జాబితాను అందజేయాల్సిందిగా ఐసీఎంఆర్‌ని అడిగినట్లు సంబంధిత శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీని ఆధారంగా కొవిన్‌లో ధ్రువపత్రాలను పొందుపరుస్తామన్నారు. అయితే ప్రయోగ పరీక్షల్లో భాగంగా కొందరికి ఉత్తుత్తి మందు (ప్లాసిబో) ఇస్తారని.. అలాంటి వారికి సర్టిఫికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నమోదు, టీకా పొందిన తర్వాత డిజిటల్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు కొవిన్‌ పోర్టల్‌ను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన