ఇరాన్‌పై డెల్టా పంజా

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:25 IST

ఇరాన్‌పై డెల్టా పంజా

ఒక్క రోజే 35 వేల కొవిడ్‌ కేసులు

టెహ్రాన్‌: భారత్‌లో కరోనా రెండో దశలో విలయం సృష్టించిన డెల్టా వేరియంట్‌ వైరస్‌.. ప్రస్తుతం ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,900 కేసులు, 357 మరణాలు నమోదయ్యాయి. సోమవారం సైతం 31,814 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. డెల్టా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించిన ఇరాన్‌ ప్రభుత్వం గత వారం జన సంచారంపై ఆంక్షలు విధించింది. కార్యాలయాలు, నిత్యావసరం కాని వ్యాపారాలు మూసివేయాలని ఆదేశించింది. అయితే ఆంక్షల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా ప్రజల విచక్షణకే వదిలేయడంతో.. టెహ్రాన్‌లో జనసమ్మర్దం మునుపటిలాగే కొనసాగుతోంది. షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లు, మెట్రో స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్య నిపుణుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. శ్వాస సమస్యలతో వస్తున్న వారితో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన