భారతీయ నావికులపై అనధికార నిషేధమేమీ లేదు

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:02 IST

భారతీయ నావికులపై అనధికార నిషేధమేమీ లేదు

చైనా విదేశాంగ శాఖ వెల్లడి

బీజింగ్‌: భారతీయ నావికులు సిబ్బందిగా ఉన్న వాణిజ్య నౌకలకు తమ దేశ ఓడరేవుల్లో అనుమతిలభించడం లేదన్న విమర్శలను చైనా తోసిపుచ్చింది. భారతీయ నావికులపై అనధికార నిషేధమేమీ విధించలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిచ్కీజిజియాన్‌ మంగళవారం బీచ్కీజిజింగ్‌లో తెలిపారు. మీడియాలో వస్తున్న అటువంటి వార్తా కథనాల్లో నిజం లేదని పేర్కొన్నారు. అఖిలభారత నావికులు, కార్మికుల సంఘం నాయకులు ఇటీవల కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలరవాణా మంత్రి శర్బానంద సోనోవాల్‌కు లేఖ రాస్తూ...చైనా వెళ్లే నౌకల్లో పనిచేసే భారతీయ సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి భారతీయ నావికులు ఉన్న నౌకలకు చైనా ఓడరేవుల్లోని బెర్తులను నిరాకరిస్తున్నారని దీనివల్ల వాణిజ్య నౌకల యజమానులు భారతీయులను విధులకు అనుమతించడంలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల దాదాపు 20వేల మంది నావికులు ఉపాధి కోల్పోయి ఇళ్లవద్దే ఉంటున్నారని వివరించారు. భారతీయ నావికులున్న జగ్‌ ఆనంద్‌, ఎంవీ అనస్తాసియా వాణిజ్య నౌకలను చైనా ఓడరేవుల్లోకి అనుమతించకపోవడంతో సముద్ర జలాల్లోనే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన