బుకర్‌ ప్రైజ్‌ రేసులో సంజీవ్‌ సహోతా

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:03 IST

బుకర్‌ ప్రైజ్‌ రేసులో సంజీవ్‌ సహోతా

కాల్పనిక సాహిత్యం విభాగంలో మరో 13 మందితో పోటీ

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ రచయిత, సంజివ్‌ సహోతా.. కాల్పనిక సాహిత్యం విభాగంలో ప్రతిష్ఠాత్మక బుకర్‌ ప్రైజ్‌-2021కి పోటీపడుతున్నారు. ‘చైనా రూమ్‌’నకు గాను సంచ్కీజీజివ్‌ బుకర్‌ ప్రైజ్‌ రేసులో నిలిచారు. ఈ మేరకు 2021 లాంగ్‌లిస్ట్‌ లేదా ‘ద బుకర్‌ డజన్‌’ పేరుతో నిర్వాహకులు 13 నవలల జాబితాను మంగళవారం విడుదలచేశారు. అక్టోబర్‌ 1 2020 తర్వాత బ్రిటన్‌, ఐర్లండ్‌లలో ప్రచురితమైన 158 నవలలను వడపోసి ఈ జాబితాను రూపొందించారు. నోబెల్‌ పురస్కార గ్రహీత కాషివో ఇషగురో, పులిట్జర్‌ విజేత రిచర్డ్‌ పావజ్‌ తదితరులు కూడా తుది 13 మంది జాబితాలో నిలిచారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన