జర్మనీ రసాయన పరిశ్రమలో పేలుడు

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:03 IST

జర్మనీ రసాయన పరిశ్రమలో పేలుడు

ఒకరి మృతి.. నలుగురి గల్లంతు

బెర్లిన్‌: జర్మనీలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా... నలుగురి ఆచూకీ తెలియరాలేదు. మరో 16 మందికి గాయాలయ్యాయి. లావెర్కుసేన్‌ నగరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. చెంపార్క్‌ ప్రదేశంలో ఉన్న రసాయన పరిశ్రమలోని వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రంలో ఉదయం పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. క్రమంగా ఇది  అగ్నిప్రమాదంగా మారిందని కెమికల్‌ పార్కును నిర్వహిస్తున్న కరెంటా తెలిపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురి కార్మికుల ఆచూకీ కనిపించలేదని పేర్కొంది. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారని.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించింది. పేలుడు కారణంగా దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు ర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ నుంచి సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని జర్మనీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు సూచించారు. సమీపంలోని ప్రధాన రహదారులను అన్నింటినీ మూసివేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన