పెద్ద పేగుకు సోకిన బ్లాక్‌ ఫంగస్‌

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 06:03 IST

పెద్ద పేగుకు సోకిన బ్లాక్‌ ఫంగస్‌

ముంబయి: ఇప్పటివరకు మానవ శరీరంలోని కళ్లలో, మెదడులో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని వైద్యులు గుర్తించారు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన 70ఏళ్ల వృద్ధుడి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు సెవెన్‌ స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణంగా ఇప్పటికే కంటిచూపు కోల్పోయారు. కొద్దిరోజుల క్రితం వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర.. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన