ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఘర్షణ

ప్రధానాంశాలు

Published : 29/07/2021 05:32 IST

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఘర్షణ

ముగ్గురు సైనికుల మృతి

యెరెవాన్‌(ఆర్మేనియా): ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ సరిహద్దులో మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. బుధవారం జరిగిన ఈ ఘర్షణలో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు గాయపడ్డారని అర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులూ గాయపడినట్లు అజర్‌బైజాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వివాదాస్పద నగోర్నో-కరాబఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అజర్‌బైజాన్‌ దళాలు తన భూభాగంలోకి చొరబడ్డాయని ఆర్మేనియా చేసిన ఆరోపణల కారణంగా అక్కడి సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు ఇంకా గుర్తించని ప్రాంతాలను తమ భూభాగంగా పరిగణించిన అజర్‌బైజాన్‌ కూడా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ క్రమంలో బుధవారం తాజాగా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఈ ఘర్షణలపై ఇరు దేశాలు ఒకదానికొకటి పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. సరిహద్దులోని కల్బజార్‌ భాగంలో అర్మేనియన్‌ దళాలు తన స్థావరాలపై కాల్పులు జరిపాయని అజర్‌బైజాన్‌ పేర్కొనగా.. అజర్‌బైజాన్‌ ఉద్దేశపూర్వకంగా ఘర్షణను ప్రారంభించిందని ఆర్మేనియా ఆరోపించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన