ఇద్దరు చైనా కార్మికులపై పాక్‌లో కాల్పులు

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:39 IST

ఇద్దరు చైనా కార్మికులపై పాక్‌లో కాల్పులు

ఒకరికి గాయాలు

ఇస్లామాబాద్‌/బీజింగ్‌: చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగి 13 మంది మరణించిన రెండు వారాలకే మళ్లీ ఆ తరహా ఘటన చోటుచేసుకుంది. కరాచీలో ఇద్దరు చైనీయులు వెళ్తున్న ఓ వాహనంపై గుర్తు తెలియని సాయుధులు బుధవారం కాల్పులు జరిపారు. కర్మాగార కార్మికులైన ఆ ఇద్దరిలో ఒకరు గాయపడగా మరొకరికి ఎలాంటి హాని కలగలేదని పోలీసులు తెలిపారు. మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపిన అనంతరం పారిపోయారని, వారి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాద కారణాలు ఉండకపోవచ్చని చైనా అభిప్రాయపడింది. వేరే ఏ ఘటనతోనూ సంబంధంలేని దాడిగా అభివర్ణించింది. చైనా పౌరులు, ఆస్తులను పాక్‌ కాపాడుతుందన్న సంపూర్ణ విశాసం ఉందని ప్రకటించింది. పాక్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన చైనా పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వీటి కోసం వేల మంది చైనా ఉద్యోగులు పాక్‌లో నివిసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీయులు లక్ష్యంగా పాక్‌లో దాడులు పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.


చైనా ఆర్థిక మంత్రితో తాలిబన్‌ నేత భేటీ

బీజింగ్‌: తాలిబన్‌ నేత ముల్లా అబ్దుల్‌ ఘని బరాదర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం బుధవారం అనూహ్యంగా చైనాను సందర్శించింది. ఆ దేశ ఆర్థిక మంత్రి వాంగ్‌ యీతో తియాన్‌జిన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా చైనాను విశ్వాసపాత్రమైన మిత్రదేశంగా ఘని అభివర్ణించారు. అఫ్గానిస్థాన్‌ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని చైనాకు హామీ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత తాలిబన్లకు, చైనాకు మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఆఫ్గన్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఉమ్మడి పోరాటం చేయాలని పాక్‌, చైనా నిర్ణయించుకున్న కొన్ని రోజులకే ఈ భేటీ జరగడం గమనార్హం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన