కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్యం విషమం

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:40 IST

కల్యాణ్‌సింగ్‌ ఆరోగ్యం విషమం

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ పోస్టుగ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఆయన్ను ఇంట్యుబేషన్‌లో ఉంచామని, ప్రాణాధార వ్యవస్థ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అనారోగ్యంతో ఉన్న కల్యాణ్‌ సింగ్‌ ఈ నెల 4వ తేదీ నుంచి లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా భాజపా సీనియర్‌ నాయకురాలు ఉమాభారతి బుధవారం ఆసుపత్రికి వెళ్లి కల్యాణ్‌సింగ్‌ను పరామర్శించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన