అందుబాటులో.. ఖైదీల శిక్షాకాలం వివరాలు

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:32 IST

అందుబాటులో.. ఖైదీల శిక్షాకాలం వివరాలు

 సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: ఖైదీల్లో ఎవరెవరు ఎంతకాలం నుంచి జైళ్లలో ఉంటున్నారనే వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. పెరోల్‌ వంటి మార్గాల్లో వారు విడుదలయ్యేందుకు అది ఉపకరిస్తుందని తెలిపింది. ఖైదీల శిక్షాకాలం వివరాలతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం దిల్లీ ప్రభుత్వాన్ని ఇప్పటికే స్పందన కోరిన సంగతి గమనార్హం. శిక్షకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేస్తే ఖైదీల గోప్యత హక్కును అతిక్రమించినట్లవుతుందంటూ దిల్లీ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ జయంత్‌ సూద్‌ వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం పెదవి విరిచింది. ‘‘గోప్యత సమస్యలేంటి? మాకు అర్థం కావడం లేదు. సాధారణ జనానికీ ఆ వివరాలు అందుబాటులో ఉండాల్సిందే. ఓ వ్యక్తి 20 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారనుకోండి.. పెరోల్‌, ఫర్లో వంటి మార్గాల్లో విడుదలను కోరే హక్కు గురించి అతడికి తెలియజేయాల్సిన ఆవశ్యకత లేదనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించింది. శిక్ష తగ్గింపును కోరే విషయంలో ఖైదీలకు సహాయం చేసే యంత్రాంగాన్ని రూపొందించడంపై సంబంధిత అధికారులతో తాను సమావేశం ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు సీజేఐ బుధవారం తెలిపారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన